వరంగల్ లో పర్యటించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 24, 2020

వరంగల్ లో పర్యటించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు


వరంగల్ లో పర్యటించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు .  సువిశాల కాకతీయుల సుపరిపాలన కేంద్రంగా వరంగల్‌ కీర్తి ఎంతో గొప్పది. ఆదర్శనీయమైంది. తెలుగు గడ్డను ఏకం చేసిన చైతన్యం వరంగల్‌ది. రాష్ట్రంలో వరంగల్‌కున్న చారిత్రక, సాంస్కృతిక, విద్యా, సాంస్కృతిక, కళా రంగాలకు వరంగల్‌ పెట్టింది పేరు. వరంగల్‌  తెలుగు భాషకు స్ఫూర్తి. తెలుగు భాషకు పట్టం కట్టిన గడ్డ. వానమామలై వరదాచార్యులు, కాళోజీ సోదరులు, వొద్దిరాజు సోదరులు, దాశరథి సోదరులు ఒక తరాన్ని ప్రభావితం చేస్తే, పరిపాలనలో సంస్కర్కణలు చేసిన ప్రధానమంత్రిగా పీవీ నర్సింహారావు, జయశంకర్‌  వంటి మహనీయుల్ని అందించిన చారిత్రాత్మక గడ్డ వరంగల్‌.  రామప్ప, పాకాల, వేయి స్తంభాలగుడి.. ఇలా ఒకటా రెండా అనేకం. తెలుగు చరిత్రను, సాంస్కృతిక వికాసాన్ని పరిపుష్టం చేసిన గడ్డ వరంగల్‌ ఇటువంటి గడ్డ మీద చందా కాంతయ్య దూర దృష్టితో ఏవీవీ విద్యా సంస్థను నెలకొల్పడం, ఆ సంస్థ వజ్రోత్సవాలను జరుపుకోవటం, అందులో నన్నూ భాగస్వామ్యం చేయడం ఎంతో సంతోషంగా ఉంది’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనకు వరంగల్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )