టీఎస్‌ ఆర్టీసీ అభివృద్ధి కోసం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ కుమార్‌ ప్రత్యేక సమావేశం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 12, 2020

టీఎస్‌ ఆర్టీసీ అభివృద్ధి కోసం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ కుమార్‌ ప్రత్యేక సమావేశం

టీఎస్‌ ఆర్టీసీ అభివృద్ధి కోసం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ కుమార్‌ ప్రత్యేక సమావేశం.,  సంస్థాగత విషయాలపై ట్రాన్స్‌ఫోర్ట్‌ భవన్‌లో బుధవారం మధ్యాహ్నం సంస్థ ఎండీ, టీ.ఆర్‌.అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మతో పాటు ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మరి ముఖ్యంగా సిబ్బంది ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యల్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. టీఎస్‌ ఆర్టీసీలో ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ కుమార్‌ తెలిపారు. ఈ క్రమంలో ఉద్యోగ భద్రత విధివిధానాలను వారం రోజుల్లోగా తయారుచేసి అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి  మంగళవారం ఉద్యోగుల సమస్యల వినతుల పరిష్కారానికి దృష్టిసారించాలన్నారు. ఓ.డి, మెడికల్‌ గ్రౌండ్‌, సెలవుల కోసం వచ్చే వినతులపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు పురుషోత్తం, వినోద్‌కుమార్‌, టి.వి.రావు, యాదగిరి, వెంకటేశ్వర్లు, రమేశ్‌, శ్రీలత, సూర్య కిరణ్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )