తెలంగాణ రాష్ట్రంలో సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం నోటిఫికేషన్‌ జారీ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 21, 2020

తెలంగాణ రాష్ట్రంలో సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం నోటిఫికేషన్‌ జారీ

తెలంగాణ  రాష్ట్రంలో సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 87 పోస్టులకు నోటిఫికేషన్‌రాగా,  అందులో 70 పోస్టులు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేస్తారు. వీటిలో 31 పోస్టులను ఓపెన్‌ కేటగిరీకికేటాయించారు ,  అందులో 11 పోస్టులు మహిళలకు ఇచ్చారు. దివ్యాంగులకు (ఓపెన్‌ కేటగిరి)–1, బీసీ–ఎ 6 (మహిళలకు 2), బీసీ–బీ 8 (మహిళలకు 4), బీసీ–సీ 1, బీసీ–డీ 5 (మహిళలకు 2), బీసీ–ఇ 3 (మహిళలకు 1), ఎస్సీలకు 10 (మహిళలకు 3), ఎస్టీలకు 5 (మహిళలకు 3) పోస్టులు ఖరారు చేశారు. మిగిలిన 17 పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు న్యాయవాదిగా మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధనను ఈసారి సడలించారు. తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌  ్టటజిఛి. జౌఠి. జీn ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 



( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )