హైదరాబాద్ లోని అరణ్య భవన్‌లో గిరిజన సంక్షేమశాఖ బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి హరీష్‌ రావు సమీక్ష - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, February 23, 2020

హైదరాబాద్ లోని అరణ్య భవన్‌లో గిరిజన సంక్షేమశాఖ బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి హరీష్‌ రావు సమీక్ష

హైదరాబాద్ లోని  అరణ్య భవన్‌లో గిరిజన సంక్షేమశాఖ బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి హరీష్‌ రావు సమీక్ష చేసారు  .  ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  'సబ్‌ప్లాన్‌ నిధులు సరిగా ఖర్చు అయ్యేటట్లు చూడండి. కేంద్ర నిధులతో పాటు అదనపు నిధులు వచ్చేలా యూసీలు ఇవ్వండి. కేంద్రం నుంచి వచ్చే నిధులకు మేము మ్యాచింగ్‌ నిధులు ఇస్తాం. కేంద్రం నుంచి వచ్చే డబ్బు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ప్రతి పైసాను చూసి ఖర్చు పెట్టండి. విద్యార్థులు, గిరిజనుల సంక్షేమానికి అడిగిన నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తామని' హరీష్‌ రావు పేర్కొన్నారు.  'గిరిజన శాఖకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాం. కల్యాణలక్ష్మి, పిల్లల ఆహారం, పాల బిల్లులు గ్రీన్‌ ఛానెల్‌లో పెట్టాలని విజ్ఞప్తి చేశాం. పెరిగిన అవసరాలకు అదనపు కేటాయింపులు చేయాలని కోరుతున్నామని' మంత్రి సత్యవతి తెలిపారు.





( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )