ముజఫర్‌నగర్‌ లోని పోలీస్‌ ఉన్నతాధికారి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా పోలీస్‌ ముజఫర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, February 23, 2020

ముజఫర్‌నగర్‌ లోని పోలీస్‌ ఉన్నతాధికారి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా పోలీస్‌ ముజఫర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు


ఘజియాబాద్‌ జిల్లా భోపురా గ్రామానికి చెందిన సందీప్‌ చౌహాన్‌ పెళ్లి చేసుకుంటానని నమ్మించి..నిశ్చితార్థం కానుక పేరుతో తన  దగ్గర రూ.5లక్షలు తీసుకున్నాడని, గతేడాది మార్చిలో సందీప్‌ చౌహాన్‌ ఇంట్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని రాన్‌పూర్‌కు చెందిన సదరు మహిళా పోలీస్‌ ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు సందీప్‌ చౌహాన్‌ ఆ తర్వాత తనను మరో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో హెచ్‌ఎన్‌ సింగ్‌ వెల్లడించారు. ముజఫర్‌నగర్‌ లోని పోలీస్‌ ఉన్నతాధికారి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా పోలీస్‌ ముజఫర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మహిళా పోలీస్‌ను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి..పోలీస్‌ ఉన్నతాధికారి సందీప్‌ చౌహాన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో హెచ్‌ఎన్‌ సింగ్‌ తెలిపారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )