సికింద్రాబాద్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 06, 2020

సికింద్రాబాద్‌లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి అమరావతికి వెళ్లాల్సిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపుఫోన్ రావడంతో ఆందోళన చెలరేగింది .  100కు కాల్ చేసి ట్రైన్‌లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి బెదిరించడంతో రైల్వే స్టేషన్‌లోనే ఆ రైలును ఆర్‌పీఎఫ్‌ పోలీసులు నిలిపివేశారు. రైలును అణువణువు తనిఖీ చేశారు. ఆర్‌పీఎఫ్‌ సీనియర్ డివిజన్ కమిషనర్ గాంధీ ఆధ్వర్యంలో తనిఖీలు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదని తెలిపారు. అదేవిధంగా బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ను ఫేక్ కాల్‌గా గుర్తించారు. దీంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఫోన్‌ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Post Top Ad