ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడా ఇండియా లో పర్యటించనుంది - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 21, 2020

ట్రంప్ కుమార్తె ఇవాంకా కూడా ఇండియా లో పర్యటించనుంది

ఈ నెల 24, 25 తేదీల్లో డొనాల్డ్ ట్రంప్ దంపతులు మన దేశంలో పర్యటించబోతున్నారు.. ఈ విషయాన్ని భారత విదేశీ అధికారులు ద్రువీకరించారు.ఇండియా కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ దంపతులు రాబోతున్నారు. 
ఢిల్లీతో పాటు అహ్మదాబాద్‌లో డొనాల్డ్ ట్రంప్ పర్యటించనున్నారు. ట్రంప్ భార్య మెలానియా.. ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లనున్నారు. అహ్మదాబాద్‌లో మొతేరా స్టేడియాన్ని ట్రంప్‌, మోదీలు ప్రారంభించనున్నారు. ఆగ్రాలోని తాజ్‌ను కూడా ట్రంప్ ఫ్యామిలీ సందర్శించనున్నది. 2017లో ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌లోనూ పర్యటించిన విషయం తెలిసిందే.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )