కూకట్ పల్లి ప్రతినిధి (బొమ్మ శ్రీధర్): హైదరాబాద్ కూకట్ పల్లిలో మంగళవారం రాత్రి కూకట్ పల్లి, మాదాపూర్ జోన్ డి సి పి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్డన్ నిర్వహించడం జరిగింది. ఇందులో 15 మంది సి ఐ లు, 25 మంది ఎస్ ఐ లు ,200 మంది పోలీసు బలగం, అడిషనల్ డి సి పి వెంకటేశ్వర్లు, ఎ సి పి సురేందర్ రావు, కె పి హెచ్ బి మరియు మాదాపూర్ జోన్ ఎ సి పి సురేందర్ రావు ఆధ్వర్యంలో కార్డన్సర్చ్ మొదలు పెట్టారు.
సరైన ధృవపత్రాలు లేని, ట్రాఫిక్ చలానాలు పెండింగ్ ఉన్న 55 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకొని,
నేరస్తులతో సంబంధం ఉన్నట్లు 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు...