ఆధార్ నోటీసులు జారీ చేయడంపై ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ నిలదీస్తూ ట్వీట్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 19, 2020

ఆధార్ నోటీసులు జారీ చేయడంపై ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ నిలదీస్తూ ట్వీట్‌

భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్‌లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ - ఉడాయ్‌ నోటీసులు జారీ చేయడంపై  ఏఐఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఉడాయ్‌, తెలంగాణ పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఉడాయ్‌ నోటీసులు అందుకున్న 127 మందిలో ముస్లింలు, దళితులు ఎంతమంది ఉన్నారని  ఆయన  ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఆధార్‌ సంస్థ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని, సరైన ప్రామాణికాలు అనుసరించకుండానే పక్షపాత వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు. కార్డన్‌ సెర్చ్‌ కార్యక్రమంలో ఆధార్‌ చూపమని అడగటం  పోలీసులు విరమించుకోవాలని, ఇలా చేయడానికి మీకు చట్టబద్ధ అనుమతి లేదని తెలంగాణ పోలీసులను ఉద్దేశించి అసదుద్దీన్ ట్వీట్‌ చేశారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )