అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలువనున్న తెలంగాణ సీఎం కెసిఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 22, 2020

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలువనున్న తెలంగాణ సీఎం కెసిఆర్

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారిగా భారత పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనకు విందు ఏర్పాటు చేయనున్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం భారత్‌కు చేరుకుంటారు. తొలుత మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఆగ్రాకు వెళ్తారు. అనంతం అక్కడి నుంచి ఢిల్లీకి పయమవుతారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ట్రంప్‌ కుటుంబానికి ఆతిథ్యమిచ్చే ఐటీసీ మౌర్య హోటల్‌ చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ట్రంప్‌ సహా ఆయన కుటుంబం, అధికారులు బస చేసే గ్రాండ్‌ ప్రెసిడెన్షియల్‌ ఫ్లోర్‌ను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. ట్రంప్‌ బృందం తిరిగి వెళ్లేంతవరకు ఇతరులెవరికీ ఆ హోటల్‌లో గదులను కేటాయించరు. హోటల్‌లో ఉన్న మొత్తం 438 గదులను వారికే బుక్‌ చేశారు.ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహా మహారాష్ట్ర, హరియాణా, బిహార్‌, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల సీఎంలను రాష్ట్రపతి విందుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ ఈనెల 25న ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. 


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )