కేటీఆర్ ని కలిసిన కేంద్ర ఆర్థిక ముఖ్య సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్‌ : ప్రగతి భవన్‌లో సమావేశం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 28, 2020

కేటీఆర్ ని కలిసిన కేంద్ర ఆర్థిక ముఖ్య సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్‌ : ప్రగతి భవన్‌లో సమావేశం


భారత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక ముఖ్య సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్‌తెలియచేసారు . తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుబ్రహ్మణ్యన్‌ తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. దేశ ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని సుబ్రహ్మణ్యన్‌ వెల్లడించారు. పారిశ్రామిక రంగం పురోగతి, పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను కేటీఆర్‌ వివరించారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక విజయాలు నమోదు చేసిందన్నారు. కేంద్రం విధానపరంగా తీసుకుంటున్న నిర్ణయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. గతంలో హైదరాబాద్‌ ఐఎస్‌బీలో పనిచేస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యన్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )