ఇకపై హైదరాబాద్ లో చెత్త సేకరణకు టెక్నాలజీ ను ఉపయోగించుకోనున్న ప్రభుత్వం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, February 28, 2020

ఇకపై హైదరాబాద్ లో చెత్త సేకరణకు టెక్నాలజీ ను ఉపయోగించుకోనున్న ప్రభుత్వం

పట్టణ ప్రగతి లో భాగంగా తెలంగాణ రాజధాని లో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు . చెత్త సేకరణకు క్కుఆర్ విధానాన్ని తీసుకువచ్చారు , పురః వివరాలలోకి వెళ్తే ,... .కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్లలో క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమలు చేసేందుకు మొదటగా 870 ఇండ్లను ఎంపిక చేశారు. మూసాపేట సర్కిల్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ 3 ఫేజ్‌లో 420 ఇండ్లు, కూకట్‌పల్లి సర్కిల్‌లోని జలవాయు విహార్‌లో 450 ఇండ్లకు క్యూఆర్‌ కోడ్‌ విధానంతో అనుసంధానం చేస్తున్నారు. ఈ విధానంలో చెత్తను సేకరించే ప్రతి ఇంటికి క్యూఆర్‌ కోడ్‌ కలిగిన స్టిక్కర్‌ను అతికిస్తారు. ఆ కాలనీలో చెత్తను సేకరించే ఆటో డ్రైవర్‌ మొబైల్‌లో జీహెచ్‌ఎంసీ క్యూఆర్‌ కోడ్‌ వ్యవస్థ గల యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ స్వచ్ఛ ఆటో డ్రైవర్‌ చెత్తను సేకరించడానికి ఇంటికి వెళ్లినప్పుడు ఇంటి ప్రధాన గుమ్మానికి అతికించిన జీహెచ్‌ఎంసీ క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌ యాప్‌ ద్వారా కనెక్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థను జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి అనుసంధానమై ఉండడంతో స్వచ్ఛ ఆటో డ్రైవర్‌ చెత్తను సేకరించిన అంశం జీహెచ్‌ఎంసీ అధికారులందరికీ తెలుసుకునే అవకాశం లభిస్తుంది. చెత్తను ఏ సమయంలో సేకరించాడు, ఎన్ని రోజులకొకసారి సేకరిస్తున్నాడు, సేకరించిన వారి వివరాలన్నీ ఆన్‌లైన్‌ ద్వారా ఆఫీస్‌లో ఉన్న అధికారులంతా తెలుసుకునే అవకాశముంటుంది. దీంతో ఇన్నాళ్లూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్వచ్ఛ ఆటో టిప్పర్‌ డ్రైవర్ల ఆగడాలకు ఈ విధానంతో పూర్తిగా చెక్‌ పడనున్నది. కాలనీలు, బస్తీలన్నింటిలో ప్రతిరోజూ పక్కాగా చెత్తను సేకరించే  అవకాశముండడంతో స్వచ్ఛ పరిసరాల ఏర్పాటు కల సాకారమవుతుంది. 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )