తాజ్మహల్ ని వీక్షించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , మెలానియా - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 24, 2020

తాజ్మహల్ ని వీక్షించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , మెలానియా

యూపీలోని ఆగ్రాలో ఉన్న ఆ ముగ్ధ‌మ‌నోహ‌ర ప్రేమ చిహ్నాన్ని.. ట్రంప్‌, మెలానీయాలు ఆస‌క్తిగా తిల‌కించారు.  అహ్మాదాబాద్ నుంచి ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంప‌తులు.. ఇవాళ సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో తాజ్‌మ‌హ‌ల్ చేరుకున్నారు.  తొలుత సంద‌ర్శ‌కుల పుస్త‌కంలో త‌మ అభిప్రాయాల‌ను రాశారు. తాజ్ లాన్‌లో తిరిగారు.  తాజ్ ముందు ఫోటోల‌కు ఫోజు ఇచ్చారు. గైడ్ వివ‌రించిన సంగ‌త‌ల‌ను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు ట్రంప్ దంప‌తులు.  ఐస‌న్ హోవ‌ర్‌, బిల్ క్లింట‌న్ త‌ర్వాత తాజ్‌ను సంద‌ర్శించిన మూడ‌వ అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ నిలిచారు. ఆగ్రా ఎయిర్‌పోర్ట్ నుంచి సుమారు 13 కిలోమీట‌ర్ల మేర ఆయ‌న రోడ్ మార్గంలో వెళ్లారు.   17వ శ‌తాబ్ధ‌పు అద్భుత క‌ట్ట‌డాన్ని వీక్షించేందుకు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్‌, ఆమె భ‌ర్త జేర్డ్ కుష్న‌ర్ కూడా వ‌చ్చారు.  ట్రంప్ బ్లాక్ సూట్‌లో, మెలానియా వైట్ డ్రెస్‌లో .. తాజ్ ఉద్యాన‌వ‌నంలో కాసేపు గ‌డిపారు. తాజ్‌మ‌హ‌ల్ సౌంద‌ర్యం ప్రేర‌ణాత్మ‌క‌మైంద‌ని ట్రంప్ విజిట‌ర్స్ బుక్‌లో రాశారు. భార‌త్‌లో ఉన్న భిన్న సాంప్ర‌దాయాల‌కు ఇది సాక్ష్యంగా నిలుస్తుంద‌న్నారు. థ్యాంకూ ఇండియా అని రాశారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )