దేశంలోనే అట్టడుగు స్థానంలో తెలంగాణ : వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 20, 2020

దేశంలోనే అట్టడుగు స్థానంలో తెలంగాణ : వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

తెలంగాణ దేశంలోనే  పిల్లలకు టీకాలు వేయడంలో అట్టడుగు స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ 35వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది. 2019–20లో ఇప్పటివరకు దేశంలో టీకాలు వేయడంలో తమిళనాడు 148 శాతంతో మొదటిస్థానంలో నిలవగా, అట్టడుగు స్థానంలో సిక్కిం 53.60 శాతం, ఆ తర్వాత తెలంగాణ 54.30 శాతంతో వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా, టీకాలు సరఫరా చేస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వెనుకబడినట్లు కేంద్రం తెలిపింది. 2018–19లో మాత్రం తెలంగాణ 95.98 శాతం టీకాలు వేసింది. 2017–18లో 88.96 శాతం కవర్‌ చేసింది. కానీ ఈ ఏడాది వెనుకబడినట్లు కేంద్రం తెలిపింది.2019–20లో పరిమితమైన టీకాలు 54.3%.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )