ట్విట్టర్ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 13, 2020

ట్విట్టర్ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్


నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ ఎంత ఇచ్చింది, తిరిగి ఎంత పొందిందనే విషయం రాష్ట్ర ప్రజలతోపాటు దేశ ప్రజలంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం కేంద్రానికి ఎంత ఇచ్చింది, ఎంత తిరిగి పొందిందో ఆయన గణాంకాలతో సహా బయటపెట్టారు. 2014-15లో పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.40,727 కోట్లు వెళ్తే.. కేంద్రం రూ.15,307 కోట్లు తిరిగి ఇచ్చిందన్నారు. మరుసటి ఏడాది రూ.52,250 కోట్లు ఇస్తే కేంద్రం రూ.21,745 కోట్లు వెనక్కి ఇచ్చిందన్నారు. 2016-17లో రూ.57,276 కోట్లు ఇస్తే.. రూ.24,628 కోట్లు ఇచ్చిందన్నారు. మరుసటి ఏడాది రూ.52,996 కోట్లు తెలంగాణ ఇస్తే.. కేంద్రం రూ.24,479 కోట్లు వెనక్కి ఇచ్చిందన్నారు. 2018-19లో రూ.69,677 కోట్లు ఇస్తే.. రూ.26,695 కోట్లు ఇచ్చిందన్నారు.ఈ ఐదేళ్లలో తెలంగాణ కేంద్రానికి రూ.2,72,926 కోట్లు ఇస్తే.. కేంద్రం రూ.1,12,854 కోట్లు తిరిగి ఇచ్చిందని.. రూ.1,60,072 కోట్లు బ్యాలెన్స్ ఉందన్నారు. భారత్ రాష్ట్రాల కలయిక అన్న కేటీఆర్.. కేంద్రం-రాష్ట్రాల సంబంధాల విషయానికి వస్తే ఎవరూ ఇచ్చే వారు గానీ తీసుకునే వారు గానీ లేరన్నారు. కేంద్రానికి రాష్ట్రాలు చెల్లించిన ప్రతి పైసా తిరిగి చెల్లించాలని తాను డిమాండ్ చేయడం లేదన్న కేటీఆర్.. సందర్భాన్ని అర్థం చేసుకోవాలన్నారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )