హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ బ‌హిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 19, 2020

హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ బ‌హిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు

హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారీ బ‌హిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. మార్చి 15న (ఆదివారం) ఎల్బీ స్టేడియంలో ఈ సభ నిర్వహించనున్నారు. సీఏఏకు అనుకూలంగా నిర్వహించనున్న ఈ సభకు ఇప్పటికే పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్డీయేలో చేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ స‌భ‌కు హాజ‌రు కాబోతున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటికే గట్టి సందేశం పంపారు. ఈ నేప‌థ్యంలో ఈ స‌భ‌తో కేసీఆర్ విమర్శలకు కూడా చెక్ పెట్టడానికి బీజేపీ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా తో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సభలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రజల్లో అనుమానాలు తొల‌గించేందుకు బీజేపీ పలు నగరాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా బీజేపీకి అవ‌కాశం ఉన్న చోట్ల పార్టీని ప‌టిష్టం చేయ‌డానికి నేతలు మరింత ఫోకస్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ‌లో నాలుగు ఎంపీ స్థానాలు ద‌క్కించుకున్న బీజేపీ.. ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టి పోటీ ఇవ్వగల పార్టీగా ఎద‌గ‌డానికి ఇది సరైన సమయంగా భావిస్తోంది. ఈ దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )