నారాయణ కాలేజీ ఘటన దృష్ట్యా కానిస్టేబుల్‌ ని సస్పెండ్‌ చేస్తున్నట్లు హోంమంత్రి మహమూద్‌ అలీ ఆదేశాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 27, 2020

నారాయణ కాలేజీ ఘటన దృష్ట్యా కానిస్టేబుల్‌ ని సస్పెండ్‌ చేస్తున్నట్లు హోంమంత్రి మహమూద్‌ అలీ ఆదేశాలు

హైదరాబాద్ :  నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తత్తం అయ్యాయి .  కన్నకూతురు చనిపోయిందని రోదిస్తున్న మృతురాలి తండ్రి చంద్రశేఖర్‌ను శ్రీధర్‌ అనే కానిస్టేబుల్‌ బూటుతో తన్నాడు. దీంతో విద్యార్థులు పోలీసులపై తిరగబడటంతో వారు లాఠీచార్జి చేయగా పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పింది . ఆ  కానిస్టేబుల్‌ దురుసుతనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హోంమంత్రి మహమూద్‌ అలీ గురువారం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )