అరణ్యభవన్‌లో బీసీ, గిరిజన సంక్షేమశాఖల మంత్రు లు, అధికారులతో ఆర్థికమంత్రి హరీశ్‌రావు సమీక్ష - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 24, 2020

అరణ్యభవన్‌లో బీసీ, గిరిజన సంక్షేమశాఖల మంత్రు లు, అధికారులతో ఆర్థికమంత్రి హరీశ్‌రావు సమీక్ష

 ఆదివారం అరణ్యభవన్‌లో బీసీ, గిరిజన సంక్షేమశాఖల మంత్రు లు, అధికారులతో ఆర్థికమంత్రి హరీశ్‌రావు  సమీక్ష జరిపారు. వచ్చే బడ్జెట్‌లో తమశాఖలకు ఎక్కువ నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్‌, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌.. ఆర్థికమంత్రిని కోరారు. జనాభాలో బీసీలు 54 శాతం ఉన్నారని, ఆ సంఖ్యకు అనుగుణంగా నిధులు కేటాయించాలని మంత్రి గంగుల సూచించారు. కనీసం రూ.7 వేల కోట్లు కేటాయించాలని విన్నవించారు.  గిరిజన సంక్షేమానికి అధికంగా నిధులను కేటాయించాలని మంత్రి సత్యవతి కోరారు. కల్యాణలక్ష్మీ, పిల్లల ఆహారం, పాల బిల్లులు వెంటవెంటనే విడుదలయ్యేలా గ్రీన్‌ చానెల్‌లో ఉంచాలని విజ్ఞప్తిచేశారు. ఆయా సమీక్షల్లో రైతు సమన్వయసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శులు శ్రీదేవి, రోనాల్డ్‌రాస్‌, బీసీ సంక్షేమ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌, కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ, గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి, నవీన్‌ నికోలస్‌ తదితరులు పాల్గొన్నారు.ప్రతి బడ్జెట్‌లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకోసం పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తున్నారని ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ బడ్జెట్‌లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఉంటుందని హామీఇచ్చారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )