టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అసమ్మతి సెగ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 29, 2020

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అసమ్మతి సెగ

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్‌లో భేటీ అయ్యారు.  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.రానున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. అయితే, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వీరయ్య, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీ సమావేశానికి గైర్హాజరయ్యారు. అయితే, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశానికి హాజరుకాకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వారికి రాష్ట్ర పార్టీ అధిష్ఠానంతో విభేదాలు ఉండడం వల్లే రాలేదని పార్టీ వర్గాలు విశ్వసనీయంగా వెల్లడించాయి. అంతేకాక, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవి ఆశావహుల జాబితాలో ఉండడంతో వీరి గైర్హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )