కుప్పం దొంగల ముఠా ను అరెస్టు చేసిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 20, 2020

కుప్పం దొంగల ముఠా ను అరెస్టు చేసిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్

హైదరాబాద్లో పలు  చోరీలకు పాల్పడుతున్న ఓజీ కుప్పం ముఠా సభ్యులను అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ముఠాలోని ఇద్దరు సభ్యులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితుల నంచి రూ.9.40 లక్షల నగదు, నాలుగు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠా సభ్యులు వ్యక్తుల దృష్టి మరల్చి చోరీలు చేశారు. ఈ ముఠాపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోనూ కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )