ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సహకార సమరానికి రంగం సిద్ధం - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, February 23, 2020

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సహకార సమరానికి రంగం సిద్ధం


ఉమ్మడి ఆదిలాబాద్‌  జిల్లాలో సహకార సమరానికి ఫైనల్‌ తేదీ ఖరారైంది. ఈనెల 28న డైరెక్టర్ల ఎన్నిక, 29న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికకు శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల్లో సిం హభాగం కైవసం చేసుకున్న అధికార టీఆర్‌ఎస్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా కేంద్ర మార్కెటింగ్‌ సమాఖ్య(డీసీఎంఎస్‌)పై జెండా ఎగురవేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రెండింటిల్లో చైర్మ న్‌, వైస్‌చైర్మన్‌ పదవులు చేజిక్కించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి .  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలు 77 ఉండగా.. బీ కేటగిరికి చెందిన సహకార సంఘాలు 7 ఉన్నాయి. బీ కేటగిరిలో వ్యవసాయేతర సంఘాలు చైర్మన్లు, డైరెక్టర్లుగా ఎన్నికవుతారు. డీసీసీబీలో మొత్తం 20 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉండగా 16 మందిని పీఏసీఎస్‌ చైర్మన్లు ఎన్నుకుంటారు. అందులో ఎస్సీ డైరెక్టర్లు 3, ఎస్టీ 1, బీసీ 2 , జనరల్‌ 10 డైరెకర్లు ఉంటారు. బీ కేటగిరికి చెందిన వారిలో 1ఎస్సీ, ఎస్టీ1, 1 బీసీ, 2 జనరల్‌ సంఘాలకు చెందిన వారై ఉంటారు. డీసీఎంఎస్‌లో మొత్తం 10 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉండగా అందులో ఆరుగురు డైరెక్టర్లను పీఏసీఎస్‌ చైర్మన్లు ఎన్నుకుంటారు. ఇందులో కూడా ఎస్సీ 1, బీసీ 1, ఎస్టీ 1, ఓసి 3 అభ్యర్థులు డైరెక్టర్లుగా ఎన్నికవుతారు. మిగతా నలుగురు డైరెక్టర్లు బీ కేటగిరికి చెందిన సంఘాలకు చెందిన చైర్మన్లు ఎన్నికవుతారు. ఇందులో కూడా  ఎస్సీ 1, బీసీ 1 జనరల్‌ 2 డైరెక్టర్లను ఎన్నుకుంటారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )