తెలంగాణలో మంత్రుల వాహనాలపై వేలాది రూపాయలు చలానాలు పెండింగ్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 22, 2020

తెలంగాణలో మంత్రుల వాహనాలపై వేలాది రూపాయలు చలానాలు పెండింగ్‌

తెలంగాణలో మంత్రుల వాహనాలపై వేలాది రూపాయలు చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
 అత్యధికంగా మంత్రి జగదీష్‌రెడ్డి కారుపై 9 చలానాలు, రూ.9,315 జరిమానా ఉందట. ఈ వాహనాన్ని ఆయన ఉపయోగించడం లేదట. తర్వాత ఈటల రాజేందర్ కారుపై 6 చలానాలు, రూ.6210 జరిమానా వేశారు. కొప్పుల ఈశ్వర్ వాహనంపై 5 చలానాలు, రూ.5,175 రూపాయలు.. సబితా ఇంద్రారెడ్డి వాహనంపై 5 చలానాలు, రూ.2775 ఫైన్ ఉంది. మంత్రులు పువ్వాడ అజయ్‌‌‌‌ వాహనంపై మూడు పెండింగ్‌‌‌‌ చలానాలు.. గంగుల కమలాకర్‌‌‌‌ కార్లపై మూడు, శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌ వాహనంపై రెండు, వేముల ప్రశాంత్‌‌‌‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌‌‌‌, కార్లపై ఒక్కోటి ఉన్నాయి.

మరికొందరు ప్రజా ప్రతినిధుల కార్లపై కూడా చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని కుటుంబ సభ్యులు, వారి కంపెనీల పేర్లపై రిజిస్టర్ అయ్యాయట. ఈ చలానాలు కూడా ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ట్రాఫిక్ పోలీసులు ఈ పెండింగ్ చలానాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి.


( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )