హైదరాబాద్ డి సి సిబి చైర్మన్ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తున్న పట్లోళ్ల అంజిరెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, February 25, 2020

హైదరాబాద్ డి సి సిబి చైర్మన్ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తున్న పట్లోళ్ల అంజిరెడ్డి


హైదరాబాద్ డి సి సి బి చైర్మన్ పదవికి మోమిన్ పేట మండలం మేక వనం పల్లి పి ఏ సి ఎస్ ఎస్ చైర్మన్ పట్లోళ్ల అంజిరెడ్డి మంగళవారం హైదరా బాద్ లోని నాంపల్లి సెంట్రల్ బ్యాంకు లో ఎన్నికల అధికారి కే జనార్దన్ రెడ్డికి నామినేషన్లు అందజేశారు గతంలో మాదిరిగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాలో జిల్లాలతో ఏర్పాటయిన హైదరాబాద్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఎన్నికలు గతంలో మాదిరిగానే మూడు జిల్లాల్లో కలిపి డి సి సి బి మరియు డి సి ఎం.ఎస్ చైర్మెన్  పదవులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే జరుగుతున్నందున బ్యాంకు చైర్మన్ పదవి నీ ఆశిస్తున్నా అంజి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు జిల్లా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి మల్లారెడ్డి ఎమ్మెల్యే లై నా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి  పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ఏ మ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆశీస్సులు అంజిరెడ్డికి ఉండడంతో సునాయాసంగా బ్యాంకు చైర్మన్ పదవి ఖాయమని పలువురు పార్టీ నాయకులు భావిస్తున్నారు వికారాబాద్ ప్రాంతానికి ఇప్పటివరకు ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం పని చేసిన వ్యక్తి కావడంతో చైర్మన్ పదవి ఇతనికి దక్కుతుందని పలువురు చర్చించుకుంటున్నారు వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేటకు 25 సంవత్సరాల క్రితం డిసిఎంఎస్ చైర్మన్ పదవి దక్కిందని నాటినుండి ఇప్పటివరకు ఎలా ాంటి పదవులు ఆశించకుండా డా  తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తూ ఎమ్మెల్యే ఎలక్షన్ ల తో పాటు ఎంపీ  స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి అనేక కృషిచేసిన వ్యక్తి అంజి రెడ్డి గాని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి హైదరాబాద్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవి మోమిన్ పేట కే కేటాయించాలని ముఖ్యమంత్రి దగ్గర  ప్రయత్నాలు ముమ్మరం చేశారు నామినేషన్ పత్రాలను  ఎన్నికల అధికారి   జనార్దన్రెడ్డికి అందజేశారు  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి మోమిన్ పేట చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు