తెలంగాణ లో మరో బొగ్గు ఆధారిత విద్ద్యుత్తు కేంద్రం నిర్మాణం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 22, 2020

తెలంగాణ లో మరో బొగ్గు ఆధారిత విద్ద్యుత్తు కేంద్రం నిర్మాణం


తెలంగాణ లో మరో బొగ్గు ఆధారిత విద్ద్యుత్తు కేంద్రం నిర్మాణం జరుగనుంది . దీనికి పూర్తి స్థాయి లో అనుమతులు వెలుబడ్డాయని తెలుస్తుంది .  సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వెల్లటూరు గ్రామం వద్ద 300 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని మెక్వెల్ కంపెనీ ప్రతిపాదించింది. ఒక్కొక్కటి 150 మెగావాట్ల రెండు యూనిట్లతో ఉన్న ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ప్రకారం 332 ఎకరాలలో దీన్ని రూ. 2,160 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తారు. ఈ డీపీఆర్‌ను రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు అథారిటీకి సమర్పించారు. దీన్ని ఆ తర్వాత పర్యావరణ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఈ థర్మల్ ప్రాజెక్టులో ఉత్పత్తి అయిన విద్యుత్ మొత్తం తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసమే వాడుకునేలా దీన్ని రూపొందిస్తున్నారు. పులిచింతల హైడల్ డ్యామ్ ప్రాజెక్టు వద్ద ఉన్న 220 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్ ద్వారా ఈ విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం వినియోగిస్తారు. మొదటి దశ ప్రాజెక్టును అనుమతులు వచ్చిన 27 నెలల్లోనే పూర్తి చేస్తారు. రెండవ దశను మూడు నెలల వ్యవధిలో ప్రారంభిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టులో 12 నిర్మాణ ఒప్పందాలు, సాంకేతిక ఒప్పందాలు ఉంటాయి. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ డిమాండ్ ను ఏడాదికి ఆరు శాతంగా లెక్కించి ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఈ విద్యుత్ ప్రాజెక్టు అవసరమైన బొగ్గును సింగరేణి కాలరీస్ నుంచి, అంతర్జాతీయ బొగ్గు అమ్మకందార్ల నుంచి ఏడాదికి 2.01 మిలియన్ టన్నులను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు.




( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )