హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పేలుడు : తీవ్రంగా గాయపడ్డ ఒక వ్యక్తి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 10, 2020

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పేలుడు : తీవ్రంగా గాయపడ్డ ఒక వ్యక్తి

హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో  పేలుడునెలకొంది . ఓ పెయింటర్ రంగులు వేస్తుండగా రసాయనాలతో కూడిన డబ్బా పేలినట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతను మహారాష్ట్రలోని నాందేడ్ వాసిగా తెలుస్తోంది. అక్కడి నుంచి వలస వచ్చి గత ఆరేళ్లుగా ఫిల్మ్ సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం రావ్ సాహెబ్ అనే వ్యక్తి ఆసిడ్ డబ్బా తీసుకెళ్తుండగా ప్రమాదం సంభవించింది. అయితే, ఉద్యోగి పరిస్థితి విషమంగా ఉంది. అతణ్ని చికిత్స నిమిత్తం కొత్త పేటలోని సాయి సంజీవని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంతేకాక, డాగ్ స్క్వాడ్ టీమ్‌లను మోహరించారు. చుట్టుపక్కల డాగ్ స్క్వాడ్ టీమ్‌లు తనిఖీలు జరిపాయి. శనివారం ముషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని రాంనగర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్థానిక వైట్‌ హౌస్‌ హోటల్‌ సమీపంలోని ఓ చెత్త కుండీలో పేలుడు సంభవించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న డబ్బాలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు సంభవించింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )