ప్రపంచంలోనే బంగారు నిల్వలలో రెండో స్థానానికి చేరిన భారత్ : తగ్గనున్న బంగారు ధరలు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 22, 2020

ప్రపంచంలోనే బంగారు నిల్వలలో రెండో స్థానానికి చేరిన భారత్ : తగ్గనున్న బంగారు ధరలు

 ప్రపంచంలోనే బంగారు నిల్వలలో రెండో స్థానానికి చేరిన భారత్ : తగ్గనున్న బంగారు ధరలు.   మనదేశం మొత్తం మీద ఉన్న బంగారు నిల్వలు ముందు 650 టన్నులు  అయితే దీనికి ఐదు రెట్లకుపైగా.. 3,500 టన్నులకు పైగా బంగారు నిక్షేపాలను ఉత్తరప్రదేశ్‌లో గుర్తించారు. ‘జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ (జీఎస్‌ఐ), ‘ఉత్తరప్రదేశ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ జియాలజీ అండ్‌ మైనింగ్‌' సంస్థలు దాదాపు రెండు దశాబ్దాల అన్వేషణ తర్వాత మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సోన్‌భద్ర జిల్లాలో రెండు భారీ బంగారు గనులను గుర్తించాయి. సోన్‌పహాడీలో సుమారు 2,943.26 టన్నులు, హార్డీ గ్రామంలో 646.16 టన్నుల మేర బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అంచనావేస్తున్నారు. ఈ-టెండరింగ్‌ ప్రక్రియ ద్వారా ఈ బ్లాకులను వేలం వేసేందుకు ఉత్తరప్రదేశ్‌ సర్కారు సిద్ధమైంది. ఇందుకోసం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. గురువారం ఈ కమిటీ సోన్‌భద్రలో పర్యటించింది. బంగారు గనులున్న మొత్తం ప్రాంతాన్ని జియోట్యాగింగ్‌ చేసి, శనివారం నివేదికను అందజేయనున్నది. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాంతంలో బంగారు గనులను సులభంగా తవ్వవచ్చని అధికారులు చెప్తున్నారు. బంగారంతోపాటు యురేనియం వంటి విలువైన ఖనిజాలు ఈ ప్రాంతంలో ఉండొచ్చని  భావిస్తున్నారు. సోన్‌భద్ర జిల్లాలో బంగారం గురించి అన్వేషణ 1992-93లో మొదలైంది. పెద్ద ఎత్తున బంగారు నిక్షేపాలు బయటపడటంతో ఉత్తరప్రదేశ్‌ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనున్నది. యువతకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి లభించనున్నది. 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )