పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 24, 2020

పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపు


తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ రూపురేఖలు మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. పట్టణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. పట్టణ ప్రగతి విజయవంతం కావడానికి పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. ప్రతి వార్డులో పౌరులతో కమిటీలు ఏర్పాటు చేసి కనీసం మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. కాగా, మహబూబ్‌నగర్‌ పట్టణంలో సోమవారం జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొనున్నారని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలోతెలిపింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )