మూడురోజుల పాటు మంచిర్యాలలో CPI రాష్ట్ర నిర్మాణ మహాసభ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 22, 2020

మూడురోజుల పాటు మంచిర్యాలలో CPI రాష్ట్ర నిర్మాణ మహాసభ


తెలంగాణ  రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీ ఎదుర్కొంటున్న విషయాలను  అధిగమించి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై CPI దృష్టిసారించింది .  ఈ రోజు నుండి  మూడురోజుల పాటు మంచిర్యాలలో CPI రాష్ట్ర నిర్మాణ మహాసభల్లో ప్రధానంగా పార్టీ నిర్మాణం, విస్తరణ, కేడర్‌ను క్రియాశీలం చేయడంపై దృష్టి నిలపనుంది.మహాసభల చివరి రో జైన 24న పార్టీ నాయకత్వ ఎన్నిక ఉంటుంది. మళ్లీ రాష్ట్ర కార్యదర్శిగా చాడ ఎన్నికయ్యే అవకాశాలున్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ఈ మహాసభలను శనివారం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రారంభిస్తారు. ఈ మహాసభలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షత వహిస్తారు. సభల్లో డి.రాజా, సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు అజీజ్‌పాషా, తదితరులు ప్రసంగిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 400 మంది ప్రతినిధులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )