భారీగా GST వసూళ్లు నమోదు చేసిన తెలంగాణ ప్రభుత్వం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, February 18, 2020

భారీగా GST వసూళ్లు నమోదు చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రం లో ఈ సంవత్సరం జనవరిలో వసూలైన రూ.3,787 కోట్లతో కలిపి 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను, 10 నెలల కాలంలో మొత్తం రూ.24135.3 కోట్లు జీఎస్టీ ద్వారా వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.31,186.67 కోట్లు జీఎస్టీ రూపంలో ఆదా యం వస్తుందని అంచనా వేయగా, అందులో 77.3 శాతం రాబడి వచ్చింది. గతేడాది రూ.34,232.93 కోట్లు జీఎస్టీ రాబడులుంటాయని అంచనా వేయగా, 2019 మార్చి ముగిసే నాటికి 84.09 శాతం.. అంటే రూ.28,786.44 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది మరో 2 నెలలు మిగిలి ఉండటంతో ఈ 2 నెలల్లో కలిపి మరో రూ.6 వేల కోట్లు వచ్చే అవకాశముందని, దీంతో బడ్జెట్‌ అంచనాలతో సమానంగా లేదంటే అంతకు మించి ఆదాయం వచ్చే అవకాశం ఉందని పన్నుల శాఖ వర్గాలు చెపుతున్నాయి. కాగా, జీఎస్టీ వసూళ్లలో రాష్ట్ర పనితీరును 15వ ఆర్థిక సంఘం కూడా మెచ్చుకుంది.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )