బాసర IIIT లో నిజామాబాద్ కి చెందిన విద్యార్ధి ఆత్మహత్యాయత్నం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, February 05, 2020

బాసర IIIT లో నిజామాబాద్ కి చెందిన విద్యార్ధి ఆత్మహత్యాయత్నం


నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటిలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసాడు .. బాధిత విద్యార్థి నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి వాసిగా తెలుస్తోంది. నిన్న రాత్రి తోటి విద్యార్థుల తో ఘర్షణ పడగా.. అధ్యాపకులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థి సంజయ్ నాలుగు అంతస్తుల భవనం పై నుంచి దూకాడు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే సిబ్బంది నిజామాబాదు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు

Post Top Ad