జేయన్టియు హైదరాబాద్ లో "బ్లాక్ చైన్ టెక్నాలజీ” అంశంపైన ప్రారంభమైన రెండు రోజుల సదస్సు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, February 22, 2020

జేయన్టియు హైదరాబాద్ లో "బ్లాక్ చైన్ టెక్నాలజీ” అంశంపైన ప్రారంభమైన రెండు రోజుల సదస్సుకుకట్పల్లి: బొమ్మ శ్రీధర్:JNTU హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో, కంప్యూటర్ సైన్స్  అండ్ ఇంజనీరింగ్  విభాగం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపనీ ఆధ్వర్యంలో  "బ్లాక్ చైన్ టెక్నాలజీ” అంశంపై రెండు రోజుల సదస్సు తేది 22 -  ఫిబ్రవరి - 2020 శనివారం రోజున ప్రారంభం అయ్యింది.సదస్సు ప్రారంభ కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా విచ్చేసిన జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఐన్- ఛార్జ్ డాక్టర్  జి. యన్. శ్రీనివాస్ గారు, రిచర్డ్ కింగ్ గారు అకాడమిక్ ఇంటర్ఫేస్ ప్రోగ్రాం రీజనల్ హెడ్, టీసీఎస్ హైదరాబాద్, ప్రశాంత్ సాహు గారు( CSM,PSM I, CBP, CBE, CSD), టీసీఎస్ హైదరాబాద్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అధినేత డాక్టర్ ఆర్ శ్రీదేవి గారు, స్టాఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ జె ఉజ్వల రేఖ మరియు పలువురు ప్రొఫెసర్లు సదస్సులో పాల్గొన్నారు.జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. యన్. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సమాచార భద్రత కోసం క్రొత్త ఆవిష్కరణలు, సాంకేతికత  అనుసరిస్తున్న రోజుల్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం"బ్లాక్ చైన్ టెక్నాలజీ” అంశంపైన అవగాహన సదస్సులు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి  డాక్టర్ ఆర్ శ్రీదేవి గారు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక  పరిజ్ఞానాభివృద్దికి విద్యార్థులకు అందించాలనే ఉద్దేశ్యంతో రెండు రోజుల సదస్సును "బ్లాక్ చైన్ టెక్నాలజీ” వంటి సెక్యూరిటీ అంశం పైన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో సమాచార భద్రత అనివార్యంగా మారిన రోజుల్లో "బ్లాక్ చైన్ టెక్నాలజీ” వంటి అధునాతన అంశాలు విద్యార్థులకు బోధించడం ఎంతో ఉపయోగకరం అని అన్నారు.స్టాఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ జె ఉజ్వల రేఖ గారు మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజీరింగ్ విభాగం ఏటా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు.అలాగే ఇలాంటి కార్యక్రమాలను విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవడం వాళ్ళ భాధ్యత అని పేర్కొన్నారు