వచ్చే విద్య సంవత్సరం నుండి JNTUH పరిధిలోని విద్య సంస్థలలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 27, 2020

వచ్చే విద్య సంవత్సరం నుండి JNTUH పరిధిలోని విద్య సంస్థలలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం


తెలంగాణ : JNTUH  పరిధి కిందకు వచ్చే దాదాపు 250 కాలేజీలు ఇకపై బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంను తీసుకురానున్నాయి . ఇదివచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనుంది. మరో రెండు వారాల్లో అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థ రానుంది. ఇప్పటికే దీని ప్రక్రియ ప్రారంభమైందని జేఎన్‌టీయూ రెక్టార్ మరియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ చెప్పారు. ఇప్పటి వరకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం టీచింగ్ స్టాఫ్‌కు పోస్టుగ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మాత్రమే ఉండేది.దీని వల్ల  క్రమశిక్షణతో విద్యార్థులు ఉంటారని అదే సమయంలో క్లాసులకు హాజరై పాఠాలను శ్రద్ధగా వింటారని జేఎన్‌టీయూ పాలనావర్గం భావిస్తోంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )