కరోనా వైరస్ దెబ్బకు MBC( మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ ) బంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, February 13, 2020

కరోనా వైరస్ దెబ్బకు MBC( మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ ) బంద్

MBC అంటే కొత్త ఫోన్ల పరిచయ వేదిక , ఈ ఈవెంట్ ప్రతి ఏడాది జరుగుతుంది , కానీ కరోనా వైరస్ దెబ్బకు ఈ సరి జరిగే అవకాశాలు కనపడట్లే .స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఫిబ్రవరి 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2020 ప్రదర్శన రద్దయింది. ఈ మేరకు జీఎస్‌ఎంఏ ఈ ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (ఎండబ్ల్యూసీ) ప్రదర్శనకు హాజరు కాలేమని ఇప్పటికే అనేక కంపెనీలు ప్రకటించిన నేపథ్యంలో జీఎస్‌ఎంఏ ఈ ప్రదర్శనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగానే ఆయా కంపెనీలు ప్రదర్శనకు హాజరు కావడం లేదని చెప్పగా, ఇప్పుడు ఆ వైరస్‌ ప్రభావం ఇప్పటికిప్పుడు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ప్రదర్శనను రద్దు చేస్తేనే బాగుంటుందని జీఎస్‌ఎంఏ నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరిచింది. కాగా 2006లో మొదటగా ఈ ప్రదర్శన  ప్రారంభం కాగా ప్రతి ఏటా అవే తేదీల్లో ప్రదర్శనను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక మొదటిసారిగా ఈ ఏడాది ప్రదర్శన రద్దు కావడం గమనార్హం. అయితే ఎండబ్ల్యూసీ రద్దయిన నేపథ్యంలో మొబైల్‌ తయారీ కంపెనీలు తమ నూతన ఉత్పత్తులను వచ్చే నెలలో వేర్వేరుగా నిర్వహించే ఈవెంట్లలో విడుదల చేస్తాయని తెలిసింది. 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )