RTC బస్సునే ఎత్తుకెళ్లిన ఘరానా దొంగ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, February 17, 2020

RTC బస్సునే ఎత్తుకెళ్లిన ఘరానా దొంగ

తెలంగాణలో RTC బస్సునే ఎత్తుకెళ్లిన ఘరానా దొంగ .\ఈ ఘటన వికారబాద్ జిల్లాలో జరిగింది. వికారబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ నుంచీ ఆర్టీసీ బస్సు చోరికి గురైంది.  ప్రయాణీకులతో ఉన్న ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దుండగుడు ఆ బస్సును సిటీ శివారులో రోడ్డుపై బస్సును వదిలేసి పారిపోయాడు. అలా వదిలేసి వెళ్లిన బస్సులో కండక్టర్ కూడా లేడు. ఈ విషయం తెలుసుకున్న సదరు బస్సు కండక్టర్, డ్రైవర్ ఖంగుతిన్నారు. కాగా..తానే డ్రైవర్ ని..కండక్టర్ అని చెప్పిన సదరు దుండగుడు బస్సును ఇష్టానురీతిగా డ్రైవ్ చేస్తుండటంతో అతను మద్యం సేవించాడనే అనుమానతం ప్రయాణీకులు సదరు వ్యక్తిని ప్రశ్నించాడు. దీంతో సదరు దుండగుడు బస్సును అక్కడే వదిలేసి పారిపోయాడని చెబుతున్నారు. ఈ విషయంపై ప్రయాణీకులు పోలీసులకు..ఫిర్యాదు చేశారు. తరువాత డిపో మేనేజర్ కు కూడా చెప్పారు.  వెంటనే బస్సు ఉన్న ప్రాంతానికి వచ్చిన పోలీసులు ప్రయాణీకులను ప్రశ్నిస్తున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )