ఒక్కో స్కూల్ విద్యార్థిపై 1 లక్ష 25 వేలు ఖర్చు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం : రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 16, 2020

ఒక్కో స్కూల్ విద్యార్థిపై 1 లక్ష 25 వేలు ఖర్చు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం : రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు . ఇందులో    రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలలు 29,275 నడుస్తున్నాయి. వీటిలో 25.51లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి రూ.110కోట్లతో యూని ఫాంలు అందిస్తున్నాం. రూ.75కోట్లు ఖర్చు చే సి పాఠ్యపుస్తకాలు, ప్రభుత్వ స్కూళ్లల్లో రూ. 474 కోట్లతో సన్నబియ్యంతో భోజనం , ఇప్పటికే తల్లిదండ్రుల అభీష్టం మేరకు 9,537 పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియంవిగా మార్చాం’అని వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నామని, అనుమతుల్లేని పాఠశాలలపై కఠినం గా వ్యవహరిస్తున్నామని, ఫీజుల నియంత్రణ కు చర్యలు చేపట్టామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై సగటున రూ.1.25లక్షలు ఖర్చు చేస్తూ వారికి నాణ్యమైన విద్య, భోజనం, వసతులు కల్పిస్తోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

Post Top Ad