మంత్రి ఈటల రాజేందర్ రూ. 10 కోట్ల నష్టం : అసెంబ్లీలో వెల్లడి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, March 13, 2020

మంత్రి ఈటల రాజేందర్ రూ. 10 కోట్ల నష్టం : అసెంబ్లీలో వెల్లడి

మంత్రి ఈటల రాజేందర్ తనకు చెందిన పౌల్ట్రీలో రూ. 10 కోట్ల నష్టం వచ్చిందని అసెంబ్లీలో తెలిపారు . చికెన్ తినండి..పౌల్ట్రీ రంగాన్ని ఆదరించాలని ప్రజలకుతెలియచేసారు . తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 12వ తేదీ గురువారం నాడు జరిగిన సభలో...పౌల్ట్రీ రంగంలో స్కాం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించారు. మక్కలను కాజేశారని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి మంత్రి ఈటల కౌంటర్ ఇచ్చారు. వందల కోట్ల రూపాయల స్కాం జరిగిందంటూ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. తనకు నాలుగు వేల టన్నులు మాత్రమే వచ్చాయని, టన్నుకు రూ. 18 చొప్పున రూ. 6.50 లేదా రూ. 7 కోట్లు అయ్యిందన్నారు. నాకు రూ. 300 కోట్లు ఎలా వస్తాయని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చేస్తున్న గాలి ప్రచారంతో పౌల్ట్రీ రంగానికి తీవ్ర నష్టం వచ్చిందని, రూ. 1000 కోట్లు నష్టం వచ్చిందన్నారు. అంతకముందు సీఎం కేసీఆర్...కూడా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయవద్దన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే..ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో అందరికీ తెలిసిందేనన్నారు. అయినా..వారిలో ప్రవర్తనలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు.

Post Top Ad