జేయన్టియు కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో ముగిసిన 12 గంటల హాకథాన్ కార్యక్రమం. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 07, 2020

జేయన్టియు కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో ముగిసిన 12 గంటల హాకథాన్ కార్యక్రమం.

జే ఎన్ టి యు  హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్  సాంకేతికోత్సవాల్లో భాగంగా  డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్  అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రతి సంవత్సరం "క్వెస్ట్" శీర్షికన సాంకేతిక  ఉత్సవాలను జరుపుతుంది.  ఈ సంవత్సరం మార్చ్ 12, 13, 2020 వ తేదీలలో సాంకేతిక ఉత్సవాలు నిర్వహించనుంది.ఈ ఉత్సవాల్లో వివిధ సాంకేతిక అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.
Quest 2020 ఉత్సవాల్లో భాగంగా "ఓపెన్ థీమ్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ స్మార్ట్ వరల్డ్" అంశంపై “ఎక్షిలేరో” సంస్థ సహకారంతో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం లో హాకతాన్ నిర్వహించడం జరిగింది. ఈ హాకతాన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 24 ఇంజనీరింగ్ కాలేజీల నుండి విద్యార్తి బృందాలు పాల్గొన్నాయి.  ఈ కార్యక్రమం తేదీ 07 మార్చ్ 2020  రోజున ఉదయం ప్రారంభమై 12 గంటల పాటు జరిగింది.
కంప్యూటర్ సైన్సు విద్యార్ధుల యువ మేధస్సును ఉపయోగిస్తే ప్రస్తుత సాంకేతికతతో కూడిన పారిశ్రామిక అబివృద్ధి జరగడo చాల సులభం అని కంప్యుటర్ సైన్సు అండ్ ఇంగినీరింగ్ విభాగం గుర్తించి ఈకార్యక్రమాన్ని నిర్వాహించడం జరిగిందని చెబుతు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి యాన్ శ్రీనివాస్ గారు అభినందించారు.

డాక్టర్ ఆర్ శ్రీదేవి గారు కంప్యూటర్ సైన్సు విభాగ అధిపతి మాట్లాడుతూ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి హాకతాన్ కార్యక్రమాలు ఉపయోగపడుతయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యతులో ఇంకా నిర్వహిస్తామని తెలిపారు.

జేయన్టీయు కాలేజ్ వారు విద్యార్థుల స్రృజనాత్మక కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల, ఎంతో గొప్ప నూతన ప్రతిపాదనలతొ ఆవిష్కరణలతో విద్యార్థులు విజయవంతం అయ్యారని “ఎక్షిలేరో” సంస్థ ప్రముఖులు తెలిపారు.

Quest 2020 కోఆర్డినేటర్ శ్రీమతి ఉజ్వల రేఖ అసోసియేట్ ప్రెఒఫెసర్ గారు ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సాంకేతికతతో కూడిన పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన నూతన ఆలోచనలను విద్యార్థులు ప్రసంగించి 12 గంటల్లోనే ప్రతిపాదించిన ఆలోచనలయొక్క నూతన ఆవిష్కరణల నమూనాలను తాయారు చేసారని తెలిపారు. గొప్పగా ఉన్న మూడు నూతన ఆవిష్కరణలను గుర్తించి మూడు బృందాలను విజేతలుగ ప్రకటిస్తారని తెలిపారు.  వచ్చే వారం మార్చ్ 12, 13 వ తేదీలలో నిర్వహించే సాంకేతిక ఉత్సవాలలో విజతలకు బహుమతులు అందించనున్నారు. వచ్చే వారం మార్చ్ 12, 13 వ తేదీలలో  అనేక సాంకేతిక కార్యక్రమాలు జరుగుతాయని స్టూడెంట్స్ కోర్దినటర్స్ జి లక్ష్మి నర్యయణ, ఇ గోవర్దన్ తెలిపారు. ఆశక్తీ గల విద్యార్థులు 9154841748, 9912528872 నెంబర్ లపై సంప్రదించగలరని తెలిపారు ఇతర వివరాలకు www.csequest.com చూడగలరు.

Post Top Ad