వరంగల్ లో చనిపోయిన 14 వేల కోళ్లు : కారణాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపిన అధికారులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, March 05, 2020

వరంగల్ లో చనిపోయిన 14 వేల కోళ్లు : కారణాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపిన అధికారులు

వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రత్యేకమైన వ్యాధితో దాదాపు 14 వేళ్ల కోళ్లు చనిపోయాయి. ఇది కొక్కెర వ్యాధి అని, దీనివల్లే వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయని అధికారులు తేల్చారు. కొక్కెర వ్యాధితో వేలాది కోళ్లు చనిపోవడంతో రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. కొక్కెర వ్యాధి పట్ల మిగతా కోళ్ల పరిశ్రమ రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే, కొక్కెర వ్యాధి ఓ వైరస్ వల్ల వ్యాపిస్తుందని అధికారులు చెప్పారు. వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ఎల్కతుర్తి మండలంలోని సూరారం, గోపాల్ పూర్, వల్లభాపూర్, జీల్గుల, ఎల్కతుర్తి గ్రామాల్లో కోళ్ల పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయి. పది రోజుల క్రితం గోపాల్ పూర్, వల్లభాపూర్, జీల్గుల గ్రామాల కోళ్ల పరిశ్రమ నిర్వహకులు పెరిగిన కోళ్లను మార్కెట్లకు తరలించారు. సూరారం గ్రామానికి చెందిన ఓ కోళ్ల వ్యాపారి తనకున్న రెండు కోళ్ల ఫారాల్లో సుమారు 14 వేల వరకు కోళ్లను పెంచుతున్నాడు. ఇవి మరో రెండు రోజుల్లో మార్కెట్‌కు తరలించాల్సి ఉండగా, వాటికి కొక్కెర వ్యాధి సోకింది. విక్రయించే దశకు వచ్చిన కోళ్లు రోజుకు నాలుగు వేల చొప్పున మొత్తం చనిపోయాయి. దీంతో ఆ కోళ్ల వ్యాపారి ఆవేదన చెందుతున్నాడు. ఈ కోళ్లు చనిపోవడం వల్ల తనకు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. బుధవారం స్థానిక పశు వైద్యురాలు చనిపోయిన కోళ్ల ఫారాలను పరిశీలించారు. ఆ కోళ్లను పరీక్షించి.. అందులో కొన్నింటిని పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపారు. చనిపోయిన కోళ్లను అలాగే వదిలేయకుండా భూమిలో పాతి పెట్టాలని సూచించారు.