విదేశాల నుండి వచ్చే అనుమానితులను 14 రోజుల వరకు నిర్బంధం : నేరుగా క్వారంటైన్ సెంటర్లకు తరలింపు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 14, 2020

విదేశాల నుండి వచ్చే అనుమానితులను 14 రోజుల వరకు నిర్బంధం : నేరుగా క్వారంటైన్ సెంటర్లకు తరలింపు

భారత  దేశ వ్యాంప్తంగా కరోనా భారీగా ప్రభలుతుంది .  కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులను నేరుగా క్వారంటైన్ సెంటర్లకు(ప్రత్యేక చికిత్స ప్రదేశాలు ) తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్, జర్మనీ తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచనున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచే ఇది అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఒకవేళ ప్రయాణికుల సంఖ్య పెరిగితే.. హైదరాబాద్‌ పరిసరాల్లో అటవీ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన శిక్షణా కేంద్రాలను కూడా ప్రత్యేక వార్డులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన వైద్యులు, నర్సులు, ఇతర సహాయక సిబ్బందిని, ఔషధాలు, పరికరాలను యుద్ధప్రాతిపదికన సమకూర్చాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే నేరుగా గాంధీ, ఫీవర్‌, ఛాతీ ఆసుపత్రులకు తరలిస్తారు. లేనివారిని 14 రోజుల పాటు అక్కడే ఉంచుతారు.కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులను నేరుగా క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్, జర్మనీ తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచనున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచే ఇది అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఒకవేళ ప్రయాణికుల సంఖ్య పెరిగితే.. హైదరాబాద్‌ పరిసరాల్లో అటవీ, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన శిక్షణా కేంద్రాలను కూడా ప్రత్యేక వార్డులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన వైద్యులు, నర్సులు, ఇతర సహాయక సిబ్బందిని, ఔషధాలు, పరికరాలను యుద్ధప్రాతిపదికన సమకూర్చాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే నేరుగా గాంధీ, ఫీవర్‌, ఛాతీ ఆసుపత్రులకు తరలిస్తారు. లేనివారిని 14 రోజుల పాటు అక్కడే ఉంచుతారు.

Post Top Ad