ఈ రోజు నుండి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ 2020-21 వార్షిక బడ్జెట్ సమావేశాలు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, March 06, 2020

ఈ రోజు నుండి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ 2020-21 వార్షిక బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ 2020-21 వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి  ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై ఉభయసభల సభ్యులనుద్దేశించిప్రసంగం చేయనున్నారు . ప్రసంగం అనంతరం అసెంబ్లీ సభా కార్యకలాపాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఎన్నిరోజులపాటు సమావేశాలు సాగించాలన్న అంశం ఇందులో చర్చించనున్నారు. తమిళిసై గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలు ఇవే కావడం విశేషం. అయితే, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఈ నెల ఏడో తేదీన చర్చ ఉంటుంది. ఒక రోజులోనే ఆ చర్చను ముగించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 13 రోజుల పాటు శాసనసభను జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది .( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )