తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ నిధుల లేమీతో ఈ పథకం క్షేత్రస్థాయిలో ఆశించిన రీతిలో అమలు కావడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,73,763 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా.. సొంత స్థలం కలిగిన పేదలకు.. వారి స్థలంలోనే రెండు పడక గదుల ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్ష మంది లబ్ధిదారులకు తమ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని మంత్రి ప్రకటించారు. గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.11,917 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ నిరుపేదలకే డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తుండగా.. ఇక నుంచి సొంత స్థలం ఉన్న వారికి సైతం లక్ష ఇళ్లను నిర్మిస్తామని చెప్పడం వల్ల చాలా మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇంటి స్థలం ఉండి.. ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నవారికి ప్రభుత్వ నిర్ణయం వల్ల ఊరట లభిస్తుంది.
Post Top Ad
Sunday, March 08, 2020
2020 లో కొత్తగా మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇల్లు
Admin Details
Subha Telangana News