ఇరాన్ లో ఉన్న 234 మంది భారతీయులను భారత్ తీసుకొచ్చిన ప్రభుత్వం : కరోనా వైరస్ పరీక్షల తర్వాతే వారికి విడుదల - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 15, 2020

ఇరాన్ లో ఉన్న 234 మంది భారతీయులను భారత్ తీసుకొచ్చిన ప్రభుత్వం : కరోనా వైరస్ పరీక్షల తర్వాతే వారికి విడుదల


కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రభళుతోంది .  ఇరాన్‌ లో ఉన్న 234 మంది భారతీయులను కేంద్ర ప్రభుత్వం భారత్‌కు తీసుకువచ్చింది. వీరిలో 131 మంది విద్యార్థులు ఉండగా 103 మంది యాత్రికులు ఉన్నారు. ఎయిర్‌ ఇండియాకు చెందిన రెండు విమానాలు ఈ ఉదయం ప్రయాణికులతో జైసల్మేర్‌కు చేరుకున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్య పరీక్ష నిమిత్తం వీరందరినీ జైసల్మేర్‌లోని ఆర్మీ వెల్‌నెస్‌ సెంటర్‌కు తరలించినట్లు ఢిఫెన్స్‌ ప్రతినిధి కల్‌నల్‌ సోంబిట్‌ ఘోష్‌ తెలిపారు. పలు జాగ్రతలు తీసుకొని తదుపరి విషయాలు వెల్లడిస్తామని తెలిపారు .

Post Top Ad