25 రూపాయలకే కిలో చికెన్ ... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 09, 2020

25 రూపాయలకే కిలో చికెన్ ...

తెలంగాణలో కరోనావైరస్ కేసు నమోదుతో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో పౌల్ట్రీ పరిశ్రమకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. అనేక పుకార్లు పుడుతుండడంతో చికెన్ షాపునకు వెళ్లేందుకు కూడా జనం వెనకడుగు వేస్తున్నారు. దీంతో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం కూడా కరోనా వైరస్ వల్ల ఎలాంటి ప్రమాదం ఉండబోదని అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా పలు మంత్రులు వేదికపై స్వయంగా చికెన్ తిని కరోనాకు దీనికి ఏం సంబంధం లేదని చాటారు. చికెన్ కొనడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఓ చికెన్ షాపు యజమాని వినూత్న రీతిలో ప్రచారం చేశాడు. కేవలం రూ.100 కే నాలుగు కిలోల బరువు తూగే రెండు కోళ్లు అమ్ముతూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాడు. కోళ్లకు కరోనా వైరస్ ఉండదని చాటి చెప్పేందకే ఈ తరహా అమ్మకాలు చేపట్టినట్టు షాపు యజమాని తెలిపాడు. ఈ రకంగా చూస్తే కిలో మాసం రూ.25 కే వచ్చినట్టవుతోంది. ఈ ఆఫర్‌తో సదరు చికెన్ షాపునకు మాంసాహారులు క్యూ కట్టారు.

Post Top Ad