ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కి ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున నిధులు కేటాయింపు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, March 08, 2020

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కి ఒక్కొక్కరికి 3 కోట్ల చొప్పున నిధులు కేటాయింపు

తెలంగాణ  రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల పరిధుల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం ఒక్కొక్కరికి రూ.3 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎస్‌డీపీ నిధుల కోసం ఈ బడ్జెట్‌లో రూ.480 కోట్ల నిధులు కేటాయించారు. అంతేకాక, ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల్లో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే 82 నియోజకవర్గాల్లో కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేశారు.

Post Top Ad