తెలంగాణలో విద్యా సంస్థలు, మాల్స్‌ బంద్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, March 14, 2020

తెలంగాణలో విద్యా సంస్థలు, మాల్స్‌ బంద్‌


రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మరో నాలుగు రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్‌ ప్రకారం జరుగనున్నాయి. ఈ మేరకు కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడం భాగంగా ముందు జాగ్రత్తగా పాఠశాలతో పాటు, సినిమా హాల్స్‌, మాల్స్‌ను కూడా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Post Top Ad