బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌కు నటుడు ప్రకాశ్ రాజ్ సపోర్ట్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 09, 2020

బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌కు నటుడు ప్రకాశ్ రాజ్ సపోర్ట్

బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌కు నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతు పలికారు. ఈ మేరకు ఇద్దరు కలిసి సోమవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను కలిశారు. తనకు న్యాయం కావాలని రాహుల్ పోరాడుతున్న నేపథ్యంలో వీరు చీఫ్ విప్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, కాంప్రమైజ్ చేసుకొనేందుకు చీఫ్ విప్‌ను కలవాల్సిన అవసరం లేదని ప్రకాశ్ రాజ్ చెప్పారు. అంతేకాక, ఆ దాడిలో రాహుల్ వైపు తప్పేమీ లేదని అన్నారు. సోమవారం పాతబస్తీలోని రాహుల్ సిప్లిగంజ్ ఇంటికి వచ్చిన ప్రకాష్ రాజ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాహుల్‌పై దాడి చేయడం పెద్ద తప్పేనని అభిప్రాయపడ్డారు. దాడి చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లైనా శిక్ష పడాల్సిందేనని తేల్చి చెప్పారు. రాహుల్‌కు ఎవరూ లేరనుకోవద్దంటూ తామంతా ఉన్నామని భరోసానిచ్చారు. అంతేకాక, ఆయనకు తన అభిమానులు కూడా ఉన్నారని, వారు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పారు.

Post Top Ad