నాంపల్లిలో 4 వేలు లంచం తీసుకుంటూ అనిశా కి చిక్కిన ప్రభుత్వ అధికారి - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, March 13, 2020

నాంపల్లిలో 4 వేలు లంచం తీసుకుంటూ అనిశా కి చిక్కిన ప్రభుత్వ అధికారి


సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కావాలని అడిగిన సదరు వ్యక్తి నుంచి 4 వేలు లంచం తీసుకుంటూ ‘వక్ఫ్‌బోర్డు’ ఉద్యోగి అనిశా అధికారులకుచిక్కాడు . వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు తోవ్లియత్‌ కమిటీ, పర్మిషన్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ సెక్షన్‌ జోన్‌-1లో జూనియర్‌ అసిస్టెంట్‌గా అజహర్‌ విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. ఓల్డ్‌ మలక్‌ పేట్‌కు చెందిన సయ్యద్‌ మోహినుద్దీన్‌.. ఓ మజీద్‌లో జరుగుతున్న పనులకు సంబంధించి ఆర్‌టీఐ యాక్ట్‌ ద్వారా వివరాలు కావాలని అజహర్‌ను కోరాడు. దీంతో అతను రూ.4వేలు ఇస్తే చెబుతానన్నాడు. దీంతో బాధితుడు  ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు గురువారం నాంపల్లి హజ్‌ లో  లంచం తీసుకుంటున్న అజహర్‌ ఖాన్‌ను  రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Post Top Ad