త్వరలో మొదటిదశ పెండింగ్‌లో ఉన్న 5 కిలోమీటర్ల మెట్రో పనులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, March 09, 2020

త్వరలో మొదటిదశ పెండింగ్‌లో ఉన్న 5 కిలోమీటర్ల మెట్రో పనులు

ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ కీలకంగా మారనున్నది. ఇప్పటికే మొదటి దశలో  69 కిలోమీటర్ల మేర ప్రయాణం అందుబాటులోకి రాగా, విస్తరణ వైపు అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే రెండో దశ మెట్రో రైలును అందుబాటులోకి తెస్తున్నది. అతి తక్కువ కాలంలో ఏ ఇతర మెట్రోరైలుకు సాధ్యం కాని బ్రేక్‌ ఇవెన్‌ను సొంతం చేసుకోవడం మెట్రోపై నగరవాసులు కనబరుస్తున్న ఆసక్తికి అద్దం పడుతున్నది. మొదటి దశ మెట్రోలో భాగంగా ప్రతిపాదించిన మెట్రోరైలు నిర్మాణం అతిత్వరలో ప్రారంభం కానున్నది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ప్రస్తావించారు. త్వరగా పనులు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ను కూడా ఆదేశించారు. ఎల్‌అండ్‌టీని పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని, స్థాని క ఎమ్మెల్యేలు దగ్గరుండి పూర్తిచేయించాలని సూచించారు. మొ త్తం మొదటి దశ ప్రాజెక్టులో మూడు కారిడార్లలో దాదాపు 74 కిలోమీటర్ల మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మించాల్సి ఉండగా మొత్తం 69 కిలోమీటర్లు పూర్తి చేశారు. మిగతా 5 కిలోమీటర్లు ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించాల్సి ఉన్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే, మార్కింగ్‌ పను లు ప్రారంభం కాగా త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారు.

Post Top Ad