ప్రభుత్వ కాంట్రాక్టులో 55 లక్షలను కొట్టేసిన ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, March 10, 2020

ప్రభుత్వ కాంట్రాక్టులో 55 లక్షలను కొట్టేసిన ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

కార్పొరేషన్‌లో పనుల కోసం కాంట్రాక్టర్లు చెల్లించిన రూ.55.93 లక్షల  సొమ్మును ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కొట్టేశారు. తెలంగాణ గ్రామీణ నీటిపారుదల కార్పొరేషన్‌లో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏకంగా ప్రభుత్వాన్నే మోసం చేశారు. నవీన్ కుమార్, సాయిరాం.. ఇద్దరూ కలిసి ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారు. ఇందుకోసం ఇంజినీర్ పేరుతో హైదరాబాద్‌లోని ఓ ఆంధ్రా బ్యాంకులో ఖాతా తెరిచారు. అందులో డబ్బు డిపాజిట్ చేసి నెలనెలా రూ.లక్షల్లో లావాదేవీలు జరిపారు. ఈ మోసంపై తగిన ఆధారాలు సేకరించిన అధికారులు గతేడాది అక్టోబరులో వీరిని ఉద్యోగం నుంచి తీసేశారు. కొట్టేసిన సొమ్మును తిరిగి ఇచ్చేలా సంతకాలు చేయించుకున్నారు. రూ.40 లక్షలు తిరిగి ఇచ్చిన నిందితులు.. మిగతా సొమ్మును ఇవ్వబోమని.. దిక్కున్నచోట చెప్పుకోవాలని తేల్చి చెప్పారు. దీంతో కార్పొరేషన్ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.a

Post Top Ad