రియల్‌మి 6 సిరీస్ తో వస్తున్నా సల్మాన్ కి పోటీగా రన్వీన్ సింగ్ తో రెడీమి నోట్ 9 సిరీస్ ని ఇండియా కి తెస్తున్న రెడీమి . వివరాల్లోకి వెళ్తే రెడ్మీ నుంచి నోట్ సిరీస్ ఫోన్లు అందరికీతెలిసినవే . తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లకు దేశంలో మంచి డిమాండ్ ఉంది. రెడ్మీ నోట్ 4జీతో మొదలై.. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు నోట్ 8, నోట్ 8 ప్రో వరకు ఫోన్లు వచ్చాయి. తాజాగా ఈ సిరీస్ నుంచి నోట్ 9 త్వరలో రాబోతోంది. మార్చి 12న జరిగే కార్యక్రమంలో నోట్ 9 సిరీస్ ఫోన్లను విడుదల చేయనున్నారు. బాలీవుడ్ నటుడు రణవీర్‌సింగ్ ఈ ఫోన్లను విడుదల చేయనున్నట్లు షావోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్లో ఫోన్‌ను టీజ్ చేస్తూ ఓ పోస్టర్ పెట్టారు. దీని ప్రకారం.. ఇందులో వెనుక వైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. ఇది వరకు వచ్చిన నోట్ 8 సిరీస్‌లో క్వాడ్ కెమెరా అమర్చినప్పటికీ నోట్9 సిరీస్‌లో దీర్ఘచతుర్రాసాకారంలో కెమెరా సెటప్ తీసుకొస్తున్నారు. ఇది ఐఫోన్ 11 ప్రోను పోలి ఉంది. గతంలో లాగానే నోట్ 9తో పాటు నోట్ 9 ప్రోను కూడా ఈ సారి విడుదల చేయనున్నారు. స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో తీసుకొచ్చే అవకాశం ఉంది. దేశీయంగా చైనా కంపెనీలైన రియల్మీ, ఐక్యూ బ్రాండ్లు ఇప్పటకే 5జీ ఫోన్లు విడుదల చేశాయి. రియల్మీ సైతం 6 సిరీస్‌లో ఫోన్లు లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీంతో తామూ రేసులో ఉన్నామూంటు నోట్9 సిరీస్ ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు షావోమీ ప్రకటన చేయడం గమనార్హం.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )